తల్లి గెలుపు కోసం ఆస్ట్రేలియా నుంచి..!
JGL: తల్లిని సర్పంచిగా గెలిపించేందుకు ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ కుమారుడు స్వయంగా వచ్చి ప్రచారం చేసి, ఓటు వేశాడు. కోరుట్ల మండలం సంగెం గ్రామంలో చీటి స్వరూప భారత రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె కుమారుడు ఈ నెల 4న ఆస్ట్రేలియా నుంచి వచ్చి ప్రచారం చేపట్టి, నేడు ఓటు వేశారు.