సోమందేపల్లిలో చేతిపంపు బాగు చేయాలని వినతి

సత్యసాయి: సోమందేపల్లి మండలం వినాయకనగర్‌లో చేతిపంపు చెడిపోయి వినాయకనగర్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సోమవారం హిందూపూర్ పార్లమెంట్ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. వెంటనే వినాయకనగర్‌లో చేతిపంపు బాగు చేయించి మోటార్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరారు.