వెంకన్న అన్నదాన భవన నిర్మాణానికి భారీ విరాళం

వెంకన్న అన్నదాన భవన నిర్మాణానికి భారీ విరాళం

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి గురువారం అమలాపురం వాస్తవ్యులు శ్రీ కంచెర్ల నాగ వీరవెంకట సత్యనారాయణ, సూర్యలక్ష్మి దంపతులు రూ.1,28,000 విరాళాన్ని అందజేశారు.ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.