ఘోర రోడ్డుప్రమాదం.. తెగిపడిన తల

KRNL: ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను బొలేరో వాహనం ఢీకొగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కేశన్న (32), రజాక్ (35)గా గుర్తించారు. ఓ వ్యక్తి తల మొండెం వేరుకావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.