ఇరాన్‌పై భారీ దాడులకు ప్లాన్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై భారీ దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఇరాన్ చమురు నిల్వలు, పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించేందుకు ఇజ్రాయెల్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో పాటు అధునాతన క్షిపణులను ఇజ్రాయెల్ మోహరిస్తోంది.