ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి

NRML: కుంటాల మండలం అందకూర్ గ్రామం వద్ద ఆదివారం ఎస్ఐ రజినీకాంత్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని మైనర్లకు వాహనాలను ఇవ్వరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.