'ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైనది'

SKLM: వృత్తులన్నింటిలోకి ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైనదని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే శక్తులుగా తీర్చిదిద్దేశక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.