ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ మస్తాన్ దర్గా వెనుక రోడ్డులో శనివారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇంటింటికీ వెళ్లి సామాజిక భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ముఖంలో నవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది అన్నారు.