VIDEO: అక్రమ ధాన్యం లారీలు పట్టివేత.. ఏడుగురు డ్రైవర్లు పరార్

VIDEO: అక్రమ ధాన్యం లారీలు పట్టివేత.. ఏడుగురు డ్రైవర్లు పరార్

SRPT: చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా వడ్లను రవాణా చేస్తున్న ఏడు లారీలను చింతలపాలెం పోలీసులు ఈరోజు సీజ్ చేశారు. తెలంగాణలో సన్న వడ్లకు రూ.500 బోనస్ ఉండటంతో ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు లారీలను వదిలిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.