VIDEO: ఘనంగా బంగారు మైసమ్మ బోనాల వేడుకలు

MBNR: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో బంగారు మైసమ్మ బోనాలు వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధిని కూడా ప్రత్యేకంగా వేపాకుతో అలంకరించారు. గ్రామంలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయాన్ని కూడా అలంకరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోతురాజులు విశేషంగా ఆకట్టుకున్నారు.