'గ్రీన్ సిటీలో వైద్య శిబిరం'

'గ్రీన్ సిటీలో వైద్య శిబిరం'

ADB: మావల సబ్ సెంటర్ పరిధిలోని గ్రీన్ సిటీలో డా.సర్ఫరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. మురికి నీళ్లు నిలువ ఉన్న ప్రాంతాలలో రసాయనాలను పిచికారి చేసినట్లు తెలిపారు. అంటు రోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.