VIDEO: వన్యప్రాణుల రక్షణలో అటవీ శాఖ ముందడుగు..!

VIDEO: వన్యప్రాణుల రక్షణలో అటవీ శాఖ ముందడుగు..!

KMR: నిజాంసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నర్సింగ్‌రావుపల్లి, పిట్లం బీట్లలో అడవి జంతువుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నర్సింగ్ రావుపల్లి, బ్రాహ్మణపల్లి, మంగళూరు గ్రామ శివారు అటవీ ప్రాంతాల్లో ఉన్న 12 నీటి కుంటల్లో నీళ్లు నింపించారు. ఎండాకాలంలో అడవి జంతువులకు తాగునీటి కొరత లేకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అటవీ బీట్ అధికారి ఎండీ గయాసుద్దీన్ తెలిపారు.