నీటి సరఫరాలో అంతరాయం

నీటి సరఫరాలో అంతరాయం

GNTR: నగరంలో 17, 18 తేదీల్లో తాగునీరు అందుబాటులో ఉండదని జీఎంసీ అధికారులు తెలిపారు. తక్కెళ్లపాడు హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద పైపులైన్ లోపంతో మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 17 ఉదయం 10 గంటల నుంచి 19 ఉదయం వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. మళ్లీ యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని, ప్రజలు ముందుగానే అవసరమైన నీరు నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.