'విహార యాత్రలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది'
KMM: విహార యాత్రలతో విజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని జిల్లా టూరిజం అధికారి బి. సుమన్ చక్రవర్తి అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులతో జిల్లాలోని పులిగుండాల అభయారణ్యం విహారయాత్రలో టూరిజం అధికారి పాల్గొ న్నారు. పులిగుండాల ప్రత్యేకతల గురించి విద్యార్థులకు వివరించారు.