CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: కలువాయి మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య, సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.