మంథని ఆలయంలో టీమిండియా మాజీ క్రికెటర్

మంథని ఆలయంలో టీమిండియా మాజీ క్రికెటర్

జగిత్యాల: ప్రముఖ అంతర్జాతీయ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు సోమవారం మంథని పట్టణానికి వచ్చారు. గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి, శ్రీ రామాలయం, శ్రీ బాల సరస్వతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ ముఖ ద్వారంలో వెలసిన శ్రీ బిక్షేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.