అంగన్‌వాడీల అరెస్టులకు నిరసన
అన్నమయ్య: విజయవాడలో అంగన్‌వాడీల 36 గంటల ధర్నాను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. యూటీఎఫ్ నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. శాంతియుతంగా పోరాడుతున్న మహిళా సిబ్బందిని అరెస్టు చేయడం దుర్మార్గమని నేతలు మండిపడ్డారు.