VIDEO: గోరికొత్తపల్లిలో కుక్కలకు వింత రోగం
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలకు వింత రోగం సోకడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల శరీరం నుంచి పుండ్లు నీరు కారుతున్నాయి. దీంతో ఈగలు, దోమలు వాలి ఇండ్లలోకి వస్తున్నాయి. ఈ చర్మరోగం, ఎలర్జీ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.