శింగనమల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA
ATP: శింగనమల ప్రజలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కీలక సూచనలు చేశారు. ‘ఈనెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. చెరువులు, చెక్ డ్యాం, పంట కాలువల్లో గండ్లు, లీకేజీలను అధికారులు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలి. నీరు పారే కాలువల్లో అడ్డుగా ఉన్న రాళ్లు, వ్యర్థాలను తొలగించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి’ అని ఎమ్మెల్యే సూచించారు.