పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం

SRPT: వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.