'టెక్నికల్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లించాలి'
PPM: ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన భవనంలో జరిగిన సమావేశంలో తమ సమస్యను గిరిజన నాయకుడు తుమ్ము అప్పలరాజు దొరకు వివరించగా, ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.