రేంజ్ ఎస్పీలతో సమీక్షించిన డీఐజీ
VZM: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి రేంజ్ పరిధిలో ఉన్న ఎస్పీలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రతి జిల్లాలో 24×7 కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.