ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఫిర్యాదు

ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఫిర్యాదు

కోనసీమ: అమలాపురం పట్నంలో రహదారుల పక్కన స్థలాలు ఆక్రమించి షాపులు నిర్మించుకుంటున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలో జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అమలాపురం బస్టాండ్, హాస్పటల్, పార్కులు, గ్రంథాలయాలు, పలు ముఖ్య కూడలిలో స్థలాలు ఆక్రమించారని పేర్కొన్నారు.