VIDEO: వైభవంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ
KNR: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ బోనాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. వానలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు.