ఎల్బీపురంలో అగ్నికి ఆహుతైన పశువుల పాక

ఎల్బీపురంలో అగ్నికి ఆహుతైన పశువుల పాక

VSP: బుచ్చయ్యపేట మండలం ఎల్బీపీ అగ్రహారంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల పాక, వరిగడ్డి కుప్ప దగ్ధమయ్యాయి. జక్కాన పైడినాయుడు పశువులను మేతకు తీసుకువెళ్లగా నిప్పురవ్వలు పాకపై పడి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో పాకలో పశువులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పశువుల పాకతో పాటు, వరిగడ్డి అగ్నికి ఆహుతి అయ్యింది.