VIDEO: మున్సిపల్ కౌన్సిల్‌లో వాడివేడీగా చర్చ
W.G: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఛైర్‌పర్సన్ బర్రె వెంకట రమణ అధ్యక్షతన ఇవాళ వాడివేడీగా జరిగింది. అక్టోబరులో సాధారణ సమావేశం ఎందుకు నిర్వహించలేదంటూ పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. 60 ఏళ్ల చరిత్రలో ఇలా సమావేశం జరగకుండా లేదని వారు పేర్కొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలపైనా కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించారు.