‘ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా గుర్తుకొచ్చిందా?’
TG: హైడ్రా దాడుల అంశంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ను KTRను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. 'ఎన్నికలప్పుడే హైడ్రా గుర్తుకు వచ్చిందా?.. ఇప్పటివరకు KTR ఎందుకు మాట్లాడలేదు?' అని నిలదీశారు. BRSకు అనుకూలమైన హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే సీఎం, పీసీసీ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నవీన్ యాదవ్‌ను ఓడించడానికే ఈ కుట్ర అని జగ్గారెడ్డి ఆరోపించారు.