VIDEO: నాగల్గాంలో పారిశుధ్యం అస్తవ్యస్తం

KMR: జుక్కల్ మండలంలోని నాగల్గాంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలల నుంచి మురికి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ వాపోతున్నారు. అంబేడ్కర్ జెండా వద్ద మురికి కాలువతో పాటు చెత్తాచెదరం పేరుకుపోయిందని, ముళ్లపొదలు తొలగించలేదని చెబుతున్నారు. జీపీ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.