వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు

వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు

KMM: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం నీటిమట్టం 18.3 అడుగులకు చేరగా, పూర్తిస్థాయి నీటిమట్టం 20 అడుగులుగా ఉంది. తీగలబంజర వద్ద పగిడేరు వాగు పొంగిపొర్లడంతో పల్లిపాడు-ఏన్కూర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం అధికారులు సూచించారు.