VIDEO: పుంగనూరులో YCP నాయకుల నిరసన

CTR: MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని పలువురు వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పుంగనూరులో సోమవారం నల్ల రిబ్బన్ కట్టుకొని ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్‌లోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ సాగింది. MPని వెంటనే విడుదల చేయాలని కోరారు.