'ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి'

BHPL: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకముగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాల కోసం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి బాధ్యతగా వాటిని సంరక్షించాలని వారు కోరారు.