భారీ వర్షానికి కూలిన చెట్లు

భారీ వర్షానికి కూలిన చెట్లు

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని వీరన్నపేట వీరభద్ర కాలనీ ప్రాంతంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వీరన్నపేట కేటీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతానికి వెళ్లే దారిలో భారీ వృక్షాలు కూలిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించి మరమ్మతు చర్యలను చేపట్టారు.