మంజీర వంతెనపై రాకపోకలు నిలిపివేత

KMR: బీర్కూరు శివారులో వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో బీర్కూర్ నుంచి మంజీర వంతెన మీదుగా రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్సై రాజశేఖర్, MPDO మహబూబ్, తెలిపారు. ఈ సందర్భంగా నేడు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ని అడ్డుగా పెట్టి రోడ్డును మూసివేశారు. వరదనీటి కారణంగా మంజీర వారధి పైనుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు.