సినిమా టికెట్ల ధరల ఖరారుపై కమిటీ

AP: సినిమా టికెట్ల ధరల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాలతో కమటీ ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సినిమా టికెట్ ధరలు పెంచాలని కోరుతూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.