VIDEO: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో జాప్యం
ములుగు జిల్లా మేడారం మహా జాతర అభివృద్ధి పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లుల గద్దెల ప్రాంగణం, చిలకల గట్టు, జంపన్న వాగు, రెడ్డిగూడెం ప్రాంతాల్లో కేవలం 80 శాతం పనులే పూర్తయ్యాయి. జాతరకు వచ్చే మార్గాల్లో రోడ్డు వెడల్పు పనులు పూర్తి కాలేదని బుధవారం మేడారం జాతర పనులు నత్త నడకన సాగడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.