VIDEO: పసుపు పచ్చ రంగులో దర్శనమిచ్చిన కప్పలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలో దేవాలయం ఎదుట బుధవారం పసుపు పచ్చని కప్పలు దర్శనమిచ్చాయి. ఆ ప్రాంతంలో కప్పలు అటూ ఇటూ దుకుతూ సందడి చేశాయి. సుమారు 30వరకు ఇవి బెకబెకమంటూ సందడి చేయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భారీ వర్షాలు పడిన తరువాత చెరువులు, గెడ్డ వాగుల్లో ఇలాంటి కప్పలు కనిపిస్తాయని పశువైద్యాధిరి రాజేందర్ తెలిపారు