బీరప్ప గడ్డ పనులను పరిశీలించిన జోనల్ కమిషనర్

బీరప్ప గడ్డ పనులను పరిశీలించిన జోనల్ కమిషనర్

MDCL: ఉప్పల్ జోన్‌లో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా బీరప్పగడ్డ ప్రాంతంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఉప్పల్ నుంచి చిలుకానగర్ రూట్‌లో పైపులైన్, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనుల పురోగతిని సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.