ఆసుపత్రి నుంచి 22 మంది నావికులు డిశ్చార్జ్
ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామి ముంచేసిన విషయం తెలిసిందే. ఈ నౌక నుంచి ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న 22 మంది ఇరాన్ నావికులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వారిని భారీ భద్రత మధ్య శ్రీలంక వాయుసేన కేంద్రానికి తరలించారు. మరో 10 మంది నావికులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.