ఢిల్లీ పేలుడు కేసు.. ఇద్దరు అరెస్ట్!
ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని.. పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.