IDPL ల్యాండ్స్‌పై విచారణ హర్షణీయం: మాధవరం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విచారణకు ఆదేశించడం సంతోషమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ భూములపై తానే విచారణ కోరానని, ఏ సీఎం చేయలేని పని రేవంత్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు నిజమో కాదో తేలిపోతుందని చెప్పారు.