పైలెట్ ప్రాజెక్ట్ బుగ్గారం మండలం

JGL: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన బుగ్గారం మండలాన్ని ఎంపిక చేశామని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామన్నారు. ఈ బృందాలు షెడ్యూల్‌ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.