'కేంద్రానిది కార్పొరేట్ ప్రేమ'
SRPT: మోదీ ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపి ప్రతిజ్ఞ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, కార్మిక చట్టాలను రద్దు చేయడం అన్యాయమన్నారు. గొడ్డలి పెట్టు వంటి లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.