మూడు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం

మూడు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం

SRD: జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున మూడు రోజుల పాటు చిట్కుల్, ఇస్నాపూర్ మున్సిపాలిటీలతో పాటు అమీన్ పూర్ సర్కిల్ పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఉందని మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఈ ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని ఆమె వెల్లడించారు. గురువారం నుంచి మళ్లీ యధావిధిగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.