పట్టపగలు చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

పట్టపగలు చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే చోరీకి పాల్పడిన పీ. నూకరాజును పోలీసులు సోమవారం కొంపెల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వావిలపాడు, రామస్వామిపేట, వల్లంపూడి గ్రామాలలో జరిగిన ఈ చోరీలకు సంబంధించి నిందితుడి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు.