రేపు ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు
GNTR: తెనాలి మార్కెట్ యార్డులో రేపు ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 15కు పైగా ఒంగోలు జాతి ఆవులు యార్డుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పశు వైద్య అధికారులు మాట్లాడుతూ.. ఈ పోటీలు రేపు సాయంత్రం వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆవులను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు.