VIDEO: అదుపుతప్పి లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు
WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మంచిర్యాల నుంచి తౌడు లోడుతో ఖమ్మం వైపు వెళ్తున్న లారీ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బోల్తా పడింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.