బాధిత కుటుంబానికి LOC కాపీని అందజేసిన MLA
WGL: వర్ధన్నపేట నియోజకవర్గ MLA నాగరాజు ప్రత్యేక చొరవతో దమ్మన్నపేట గ్రామానికి చెందిన మామిడ్ల కొమురయ్య అనారోగ్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల LOC మంజూరైంది. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కొమురయ్య కుటుంబానికి ఇవాళ ఎమ్మెల్యే నాగరాజు స్వయంగా LOC కాపీ అందజేశారు. దీంతో బాధిత కుటుంబీకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.