VIDEO: ప్రొద్దుటూరులో రోడ్డు ప్రమాదం
KDP: ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో రిలయన్స్ షాపింగ్ మాల్ ఎదురుగా శనివారం కారు-బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి స్పాట్లో చనిపోగా, వెనకవైపు కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.