రెటీనా రోగులకు కొత్త సౌకర్యం

రెటీనా రోగులకు కొత్త సౌకర్యం

VSP: నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి బి బ్లాక్‌లో రెటీనా రోగుల కోసం నూతన సౌకర్యాన్ని శనివారం ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఔట్‌పేషెంట్లకు సేవలందించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. బంగార్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ ఎ. కృష్ణకుమార్‌తో పాటు రెటీనా నిపుణులు పాల్గొన్నారు.