98 పరుగుల దూరంలో 'హిట్‌మ్యాన్'
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో కలిపి 19,902 పరుగులు చేశాడు. మరో 98 పరుగులు చేస్తే.. 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాల్గవ భారత బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ జాబితాలో సచిన్ (34,357), కోహ్లీ (27,673), ద్రవిడ్ (24,064) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.